Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. ఏంటవి..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:35 IST)
తమ్ముడు పవన్ కళ్యాణ్‌ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు, అన్న నాగబాబు. బిజీగా ఉండడం కారణంగా కళ్యాణ్‌ బాబుకు సహాయం చేయలేకపోతున్నాను. రాజకీయాల్లో కళ్యాణ్‌ దూకుడు నాకు బాగా నచ్చుతోంది. నా తమ్ముడు లాంటివారు రాజకీయాల్లో ఎంతో అవసరం.
 
జవాబుదారీతనం, రాజకీయం, పదిమందికి ఉపయోగపడే రాజకీయం చేస్తున్నాడు నా తమ్ముడు. నా కొడుకు వరుణ్‌ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. రాజకీయాల్లో బాబాయ్ ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. మనం కూడా ఏదో రకంగా ఆయనకు సహకారం అందించాలంటున్నాడు. అందుకే అప్పుడప్పుడు నేను కూడా నా తమ్ముడి గురించి మాట్లాడుతున్నాను. 
 
నా తమ్ముడికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం సంతోషంగా ఉంది. టీ, కాఫీని గాజు గ్లాసులో తాగితే ఆ టేస్టే వేరు. నా తమ్ముడికి మంచి గుర్తు కేటాయించింది ఎన్నికల కమిషన్. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా ప్రజల కోసం కళ్యాణ్‌ బాబు రాజకీయాలను ఎంచుకున్నారని చెప్పారు నాగబాబు. పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన ఆ గాజు గ్లాస్ గుర్తుతో ఒక కొత్త రాజకీయ చరిత్రని సృష్టించడం ఖాయమంటున్నారు నాగబాబు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments