ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాంటి రోడ్లపై వాహనాల్లో ప్రయాణించడం కంటే కానిబాటన వెళ్లేందుకే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఏపీ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ల దుస్థితిపై ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వానికి ఎన్నసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవట్లేదని అక్టోబరు 2న శ్రమదానం కార్యక్రమం కూడా నిర్వహించింది. తాజాగా ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఓ ఫొటో పోస్ట్ చేసి రోడ్లు ఎంతగా పాడైపోయాయో వివరించారు.
'గుంటూరు నుంచి తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగుకు వెళ్లే రోడ్డు దుస్థితి ఇది.. నిద్ర లేవండి వైఎస్ జగన్ గారు' అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా ఉండడంతో దానిపైనే వర్షపునీరు నిలిచి ఉంది. అందులో నుంచే వాహనదారులు అష్టకష్టాలు పడుతూ వెళ్తున్నారు. అరకిలోమీటరు దూరం కష్టాల ప్రయాణం అంటూ ఓ దినపత్రికలో ఈ ఫొటోను ప్రచురించారు.
This is the sad condition of the main road from Guntur to Nandivelugu in Tenali Constituency. WAKE UP @ysjagan garu