Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారు... నాకు ప్రాణ హాని ఉంది... ఓటుకు నోటు కేసు న్యాయవాది

మంగ‌ళ‌గిరి : తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరగాలన్న తన పిటిషన్ పైన కోర్టు సానుకూల ఆదేశాలు ఇచ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (21:06 IST)
మంగ‌ళ‌గిరి : తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర రెడ్డి చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరగాలన్న తన పిటిషన్ పైన కోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చిన నేపద్యంలో ఆయన ఈ సందేహం వ్యక్తం చేశారు. ఈ కేసులో 200 శాతం చంద్రబాబుపై ఆరోపణలు రుజువు అవుతాయని, న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నానని అన్నారు.
 
అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన వారు తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని అన్నారు. గతంలో కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో తనపై హత్యాయత్నం జరిగిందని సుధాకర రెడ్డి తెలిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అయినా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దోషిగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయన అన్నారు.
 
ఈ కేసులో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు కాక తప్పదని, ఆ తర్వాత విచారణ జరుగుతుందని, అందులో ఖాయంగా నేరం రుజువు అవుతుందని సుధాకర రెడ్డి అన్నారు. అందుకే త‌న‌ను టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం నేత‌లు య‌త్నిస్తున్నార‌ని న్యాయ‌వాది చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments