Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో యువతి అదృశ్యం... ఫిర్యాదు చేసిన తల్లి...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:40 IST)
తిరుపతిలోని కొర్లగుంటలో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. 18 యేళ్ళ భార్గవి ఈ నెల 3వతేదీ నుంచి కనిపించడం లేదు. ఇంట్లో తల్లి రాణితో పాటు ఉంటున్న భార్గవి కళాశాల ఫీజు కట్టి వస్తానని ఇంటి నుంచి వెళ్ళింది. ఆ తరువాత 25 రోజులవుతున్నా కనిపించకుండా పోయింది. దీంతో తల్లి రాణి స్థానిక ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. 
 
ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే ఐజి, డిఐజికి లేఖ రాసింది. అయితే భార్గవి మేజర్ కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది రాణి. తన కుమార్తెను నందకుమార్, శిరీషలు కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన విషయాన్ని రాతపూర్వకంగా ఇచ్చినా పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు పెట్టారంటోంది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని, తన కుమార్తెను సురక్షితంగా అప్పజెప్పాలని కోరుతోంది.
 
అయితే పోలీసులు మాత్రం భార్గవి తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి వివాహం చేసుకుందని చెబుతున్నారు. రాణి, భార్గవి తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని దీంతో ఆమె తండ్రి దగ్గరకే వెళ్ళిపోయిందని, ఎన్నిసార్లు రాణికి చెప్పినా అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. మరి దీనిపై ఆమె తన కేసును వెనక్కి తీసుకుంటారో లేదంటా ఇలాగే మాట్లాడుతారో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments