Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టూడియోలో ప‌ని చేసుకుంటుండ‌గా... పిఠాపురం విలేకరిపై కత్తితో దాడి

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:58 IST)
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 99 ఛానల్ విలేకరిగా పని చేస్తున్న సుంకు సుబ్రహ్మణ్యంపై పిఠాపురం మండలం రాపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి పెద్ద కత్తి తో దాడి హత్యాయత్నం చేసాడు. వెంటనే తేరుకున్న విలేకరి సుబ్రహ్మణ్యం అతని నుండి తప్పించుకుని పిఠాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వ్యక్తి పెద్ద కత్తి తయారు చేసుకుని వచ్చాడని, కత్తి తో పాటు పెద్ద సంచి తెచ్చాడని తెలిపారు. 
 
 
పక్కా ప్లాన్ తో హత్య చేసేందుకు వచ్చాడని, హత్య చేసిన తరువాత  బాడీని తీసుకుపోయేందుకు సంచిలో చీర వంటి ఒక పెద్ద క్లాత్ ని తీసుకు వచ్చాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యాయత్నం నుండి తప్పించుకున్న విలేకరి సుబ్రహ్మణ్యం తోటి విలేకరులకు విషయం చెప్పి. స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హత్యాయత్నం చేసిన నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
 
బాధ్యతాయుతమైన విలేకరి వృత్తిలో ఉన్న వ్యక్తిపై ఇలా కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నం చేయడం పిఠాపురం విలేకరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనను పక్కదారి పట్టించేందుకు పావులు కదుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై న్యాయం జరిగే వరకు ఇతర జర్నలిస్ట్ లు మద్దతుగా నిలవాలని పిఠాపురం విలేకరులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments