Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కుటుంబం.. లం.. కుటుంబమా? మీ శ్రీమతిగారు దేవతా? ముద్రగడ పద్మనాభం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (11:22 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, తనను, తన భార్యను, తన కుమారుడిని, తన కోడలిని చంద్రబాబు పుత్రుడు నారా లోకేష్ పోలీసులతో బూతులు తిట్టించిన వైనాన్ని ఏకరవు పెట్టారు. అంతేకాకుండా, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా ప్రస్తావించారు.
 
ప్రధానంగా చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో "కాపు రిజర్వేషన్ కోసం తాను దీక్ష చేపట్టిన మొదటి రోజునే గౌరవ తమరి పుత్రరత్నం గారు మా ఆవరణంలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేసి ఆ లం.. కొడుకుని (నన్ను) బయటకి లాగారా? లేదా?, తలపులు బద్ధలుకొట్టి నా శ్రీమతిని లం.. లెగవే అని బూటు కాలితో తన్నించి ఈడ్చుకెళ్లింది, నా కోడలిని లం.. నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది, నా కొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకెళ్లింది తమకు గుర్తు లేదాండి? 
 
ఇపుడు తమరి నోటివెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. బాబుగారు మీ దృష్టిలో మా కుటుంబం లం.. కుటుంబమా?, మీరు, మీ శ్రీమతిగారు దేవతా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మావేమిటి, మా కొంపులు ఏమిటి? అంటూ ప్రశ్నలపై ప్రశ్నల వర్షం సంధించారు. ఈ సుధీర్ఘ లేఖలో అనేక విషయాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments