Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్యం పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ముఖేష్‌కుమార్ మీనా

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (22:09 IST)
రాజ్ భవన్ పూర్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్‌కుమార్ మీనా వాణిజ్యం ప‌రిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ మొదటి అంతస్తులో నూతనంగా కేటాయించిన ఛాంబర్‌లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు.

తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సహా పలువురు సీనియర్ అధికారులతో మీనా సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఆహార శుద్ది పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని ఆ క్రమంలోనే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి నియామకం జరిగిందన్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటును లక్ష్యంగా కలిగి ఉన్నామన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల అధారంగా ఏ జిల్లాలో ఏఏ పరిశ్రమలు రావాలన్న దానిపై కార్యచరణ రూపొందిస్తామన్నారు. రానున్న రెండేళ్ల‌లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ ఒక ఆహార శుద్ది పరిశ్రమ ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారని తదనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.

పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు, నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నాయని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ సీఈఓ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments