చంద్రబాబుకు భద్రత పెంచండి... కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:04 IST)
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు దాడికి ప్రయత్నించారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపైనే దాడికి ప్రయత్నించారని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన ఈ ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలని ప్రస్తావించారు. ఈ మేరకు దాడి ఘటన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల ర‌వీంద్ర‌బాబు మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేద‌ని, ఉల్టా తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశార‌ని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే, ఈ ఘటన జరిగిందని వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తెలిపార‌ని క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ దాడి బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తామ‌ని, ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments