Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కి పొగరెక్కువ.. మనిషికి పొగరు ఎంత ఉండాలో అంతే ఉండాలి: జేసీ

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. అతిగా ఉంటే మాత్రం ప్రమాదమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తాను వైకాపాలో చేరలేదని.. ఎన్నికలకు ముందు తా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (09:12 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పొగరెక్కువని.. మనిషికి పొగరెంత ఉండాలో అంతే ఉండాలని.. అతిగా ఉంటే మాత్రం ప్రమాదమేనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అందుకే తాను వైకాపాలో చేరలేదని.. ఎన్నికలకు ముందు తాను టీడీపీలో చేరానని తెలిపారు. ఎంపీగా గెలవడం కోసం టీడీపీలో చేరలేదన్నారు.

పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును జేసీ కొనియాడారు. హంద్రీనీవా ద్వారా 2018-19 నాటికి అనంతపురంలోని అన్ని గ్రామాలకు నీరు తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. 
 
సీమ రైతులకు సాగునీరిస్తే 2019లోనూ చంద్రబాబునాయుడే సీఎం అవుతారని అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జేసీ మాట్లాడుతూ.. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న నాయకుడు చంద్రబాబేనని ప్రశంసించారు. సీమకు సాగు నీరివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కొనియాడారు 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments