Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానికి పతనం ప్రారంభమయ్యింది... దేవుడు కూడా కాపాడలేడు... బుట్టా సంచలనం

ఎపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై హెచ్చరికల సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపిలోని ప్రధాన నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (17:00 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై హెచ్చరికల సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపిలోని ప్రధాన నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ వరుసగా కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేశారు. సహనం కోల్పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. నిన్న జె.సి.దివాకర్ రెడ్డి, నేడు ఎంపి బుట్టారేణుక. ఇలా రోజుకో ప్రజాప్రతినిధి ప్రధానిపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
 
కర్నూలు ఎంపి, బుట్టా రేణుక ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాత్రం బిజెపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రధాని మోడీకి పతనం ప్రారంభమయ్యింది.. ఇక దేవుడు కూడా ఆయన్ను కాపాడలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకు సరిపోయే ప్యాకేజీని ఇస్తామన్నారు. ఇప్పుడూ రెండూ లేకుండా పోయాయి. ఇన్ని రోజులు వేచి చూశాం.. ఇక ఆగడం సాధ్యం కాదని తేల్చేశారు బుట్టా రేణుక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments