Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెమ్ముతో బాధపడుతున్న పురిటికందును చంపేసిన తల్లి..

ఓ తల్లి నెమ్ముతో బాధపడుతున్న పురిటికందు బాధ చూడలేక చంపేసింది. ఈ ఘటన శ్రీశైలం మండలం సున్నిపెంట పట్టణంలో చోటుచేసుకుంది. పూర్ణానంద అశ్రమం సమీపంలో నివశిస్తున్న సన్నిధి శేఖర్‌, లక్ష్మీ ప్రసన్నల కూతురు లక్ష

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (08:30 IST)
ఓ తల్లి నెమ్ముతో బాధపడుతున్న పురిటికందు బాధ చూడలేక చంపేసింది. ఈ ఘటన శ్రీశైలం మండలం సున్నిపెంట పట్టణంలో చోటుచేసుకుంది. పూర్ణానంద అశ్రమం సమీపంలో నివశిస్తున్న సన్నిధి శేఖర్‌, లక్ష్మీ ప్రసన్నల కూతురు లక్ష్మీ శ్రావణిని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీకాంత్‌కు ఇచ్చి నాలుగేళ్ల కింద పెళ్లి చేశారు.

ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉండగా, శ్రావణికి 18రోజుల క్రితం రెండో కాన్పులో అడబిడ్డ జన్మించింది. వారం రోజుల క్రితం పాపకు సున్నిపెంటలో బారసాల చేశారు. కిరణ్మయి అని పేరు పెట్టారు. అయితే పాప పుట్టుకతో నెమ్ము వ్యాధితో బాధపడుతోంది.
 
పైగా మొదటి సంతానం బాబు కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. పాప పుట్టినప్పటి నుంచి నెమ్ముతో బాధపడుతున్న తీరు శ్రావణి చూడలేకపోయింది. పేదరికం వల్ల వైద్యం చేసే స్థామత లేదు. అంతే సోమవారం చిన్నారిని చంపేసింది. ఆపై నీటి ట్యాంకులో పడేసింది. పాప కనపడటంలేదని ఇరుగు పొరుగు వారితో చెప్పింది. దీంతో బం ధువులు, మిత్రులు కాలనీ అంతా వెతికారు. చివరికి ఇంటి పైన ఉన్న సింటెక్స్‌ ట్యాంక్‌లో చూడగా పాప శవం కనిపించింది.
 
ప్రాణం ఉందేమో అని వైద్యశాలకు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అయితే పోలీసు విచారణలో శ్రావణి చంపేసిన విషయాన్ని అంగీకరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments