Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనీ బిడ్డను వేడి పెనంపై కూర్చోబెట్టిన తల్లి

తన ప్రియుడితో గుట్టుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనీ కన్నబిడ్డను వేడివేడి పెనంపై కూర్చోబెట్టిందో కన్నతల్లి. అమానవీయ సంఘటన హైదరబాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (14:41 IST)
తన ప్రియుడితో గుట్టుగా సాగిస్తున్న అక్రమ సంబంధానికి అడ్డొస్తుందనీ కన్నబిడ్డను వేడివేడి పెనంపై కూర్చోబెట్టిందో కన్నతల్లి. అమానవీయ సంఘటన హైదరబాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్‌‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన లలిత వివాహిత. ఆమెకు నాలుగేళ్ల రూప అనే కుమార్తె కూడా ఉంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పైగా, ప్రకాశ్‌కు కూడా వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అయితే లలిత, ప్రకాశ్‌లిద్దరూ ఒక్కటిగా జీవించాలని నిర్ణయించుకుని, కొన్ని నెలల క్రితం శ్రీకాకుళం నుంచి పారిపోయి హైదరాబాద్‌కు వచ్చారు. 
 
ఆ తర్వాత భార్యాభర్తలమని చెప్పి ఎస్సార్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో పనికి కుదిరారు. లలిత వంట మనిషిగా, ప్రకాశ్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. అయితే, తమ ఇద్దరి సుఖానికి పాప అడ్డుగా ఉందని భావించిన ప్రకాష్ కూతురిని వదిలేయాలని లలితపై ఒత్తిడి చేయసాగాడు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి చిన్నారిని తీవ్ర చిత్రహింసలు పెట్టారు. వేడి పెనంపై బాలికను కూర్చోపెట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో రూప కాళ్లు, పిరుదులు కాలిపోయాయి. దీనికితోడు చిన్నారిని వదిలించుకోవాలని కుట్ర చేశారు.
 
ఈ క్రమంలో లలిత తన ప్రియుడితో కలిసి.. శనివారం రాత్రి నాంపల్లిలోని పోలీసు భరోసా కేంద్రానికి వెళ్లింది. తీవ్రమైన గాయాలతో ఉన్న ఈ చిన్నారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తమకు దొరికిందని పోలీసులకు చెప్పారు. అక్కడే ఉన్న చైల్డ్‌లైఫ్ అధికారులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అక్కడికి లలిత, ప్రకాశ్‌ను తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో బాలిక అనాథ కాదని.. లలిత కూతురు అని తేలింది. బాలికను వదిలించుకునేందుకే తల్లి నాటకమాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో లలిత, ప్రకాశ్‌లను అరెస్టు చేశారు. చిన్నారిని యూసుఫ్‌గూడ శిశు విహార్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments