Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తులు : రూ.170 కోట్ల నగదు డిపాజిట్లు ఈడీ ఖాతాకు బదిలీ

వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. వీటిని

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (09:21 IST)
వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. వీటిని తన ఖాతాలోకి మళ్లించుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2014 నుంచి పలు దఫాలుగా ఈడీ ఆయన కంపెనీలకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు (అటాచ్‌మెంట్‌) చేసుకున్న విషయం తెల్సిందే. వీటి మొత్తం విలువ రూ.2524 కోట్లు. ఇందులో భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి. 
 
వాటన్నింటినీ తమ అకౌంట్‌లోకి బదిలీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందటే జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది. వాస్తవానికి ఈడీ అటాచ్‌మెంట్‌ చేసినప్పటికీ ఆస్తులన్నీ ఆయా కంపెనీల పేరిటే ఉంటాయి. వాటిపై లావాదేవీలను కూడా నిర్వహించరాదు. రూ.170 కోట్ల నిల్వల పరిస్థితి కూడా అంతే. కానీ, అసాధారణ రీతిలో రూ.170 కోట్ల ఎఫ్‌డీలు, షేర్లను ఈడీ తన ఖాతాల్లోకి మళ్లించుకోవడం గమనార్హం. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే జగన్ తన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. భారతీ సిమెంట్‌ కంపెనీ తరఫు న్యాయవాదులు శనివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు. అయితే, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ శనివారం అందుబాటులో లేరు. ఆయన విశాఖపట్నంలో ఉండటంతో... హౌస్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి లభించలేదు. దీంతో వాజ్యం సోమవారం హైకోర్టులో రెగ్యులర్‌ మోషన్‌లో విచారణకు రానుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments