Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న భక్తులకు ఎల్లలా? పవన్‌కు ఆ బాబు కాదు... ఈ బాబు వేసేశారు పంచ్...

తితిదే ఈవో నియామకంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు కానీ తెదేపా నాయకులు చాలామంది ఇప్పటికే మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటున్నారంటూ కొందరు గట్టిగానే మాట్లాడారు. తాజాగా

Webdunia
మంగళవారం, 9 మే 2017 (16:14 IST)
తితిదే ఈవో నియామకంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు కానీ తెదేపా నాయకులు చాలామంది ఇప్పటికే మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటున్నారంటూ కొందరు గట్టిగానే మాట్లాడారు. తాజాగా ఇదే విషయంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. 
 
టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకాన్ని తను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న దేవుడన్నారు. అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యం ఆ దేవదేవుడి కరుణ వుంటేనే జరుగుతుందనీ, లేదంటే సాధ్యం కాదంటూ చెప్పారు. 
 
కాగా ఉత్తరాది ఐఏఎస్ అధికారికి దక్షిణాది ఆలయానికి బాధ్యతలు అప్పగించడంపై పవన్ ప్రశ్నించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించడాన్ని తాను వ్యతిరేకిని కాననీ, ఐతే దక్షిణాది వారిని కూడా ఉత్తరాది దేవాలయాలకు ఈవోలగా నియమించాలని డిమాండ్ చేశారు. మరి పవన్ కామెంట్లను ప్రభుత్వం ఎంతమేరకు సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments