Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యక్ష ఎన్నికలు వద్దు.. పరోక్షమే ముద్దు... ఎమ్మెల్సీగా నారా లోకేష్...?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ త్వరలో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇపుడు ఎన్నికలు లేవు కదా? ఆయనెక్కడ పోటీ చేస్తారనే కదా మీ సందేహం... అయితే, ఈ క

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (08:31 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ త్వరలో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇపుడు ఎన్నికలు లేవు కదా? ఆయనెక్కడ పోటీ చేస్తారనే కదా మీ సందేహం... అయితే, ఈ కథనం చదవండి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉంది. ఇందులో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి పాలక టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి ఎమ్మెల్సీ సీట్లు లభించే అవకాశం ఉంది.
 
ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరపున ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్‌ను బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ తర్వాతే తన మంత్రివర్గంలోకి తీసుకుని ఐటీ శాఖను కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. 
 
దీనికి కారణం లేకపోలేదు... తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే.. ఆయన తనయుడు కేటీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేటీఆర్‌కు కేసీఆర్ తన మంత్రివర్గంలో కీలక శాఖలను కట్టబెట్టారు. వీటిలో ఐటీ శాఖ కూడా ఉంది. అలాగే, నారా లోకేష్‌కు కూడా ఐటీ శాఖను ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments