Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజమ్మకు కోపమొచ్చింది, అసలేమైంది?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (16:43 IST)
చిత్తూరు జిల్లా పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట 500 మీటర్ల మేర పగుళ్ళు ఏర్పడినట్లు ఈ రోజు గుర్తించారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 
 
విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా అధికారులతో మాట్లాడారు. వెంటనే కట్ట పగుళ్ళు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2006లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించారు. నాణ్యత లేకుండా గతంలో దీన్ని నిర్మించారని రోజా ఆరోపిస్తున్నారు.
 
కాంట్రాక్టర్ దీన్ని గతంలో సరిగ్గా కట్టలేదని రోజా చెబుతూనే ఉన్నారు. దీంతో ఉన్నట్లుండి సమ్మర్ స్టోరేజ్ నుంచి పగుళ్ళు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని రోజా చెప్పారు. చెరువులో మధ్యలోనే ఈ ట్యాంక్‌ను నిర్మించారని.. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
 
గతంలో తను ఎన్నోసార్లు చెప్పానని అధికారుల దృష్టికి రోజా తీసుకెళ్ళారు. నగరం మధ్యలో ఉండటంతో త్వరగా ఈ పనులను పూర్తి చేసి స్థానికుల్లో భయాందోళన పోగొట్టుకోవాలని కోరారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ పైన కేసు కూడా పెట్టాలన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ తినేశాడంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments