Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసంగిస్తుండగా కరెంట్ కట్... బాలయ్య ఏమన్నారో తెలుసా?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (15:23 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులోభాగంగా, గురువారం లేపాక్షిలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తన చివరి రక్తపుబొట్టు వరకు రాయలసీమ అభివృద్ధికి పాటుపడతానని ఆయన ప్రకటించారు. 
 
ఆ సమయంలో ఉన్నట్టు కరెంట్ పోయింది. దీంతో బాలయ్య స్పందిస్తూ, ఓహో... ఇదా ఈ ప్రభుత్వ పాలన తీరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ పాలన పోయిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో విత్తనాల కొరత, కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. 
 
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో ఒకటి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుపొందగా, హిందూపురం నుంచి బాలయ్య, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌లు గెలుపొందారు. రాయలసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. వీరిలో అనేక మంది మంత్రులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments