తండ్రి నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు సినీనటుడు బాలక్రిష్ణ. అటు సినిమాల్లోను..ఇటు రాజకీయాల్లోను బిజీగా గడుపుతున్న బాలక్రిష్ణ ఈ మధ్య రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారట. సినిమాల్లో బిజీగా ఉంటూ
తండ్రి నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు సినీనటుడు బాలక్రిష్ణ. అటు సినిమాల్లోను..ఇటు రాజకీయాల్లోను బిజీగా గడుపుతున్న బాలక్రిష్ణ ఈ మధ్య రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారట. సినిమాల్లో బిజీగా ఉంటూ తన నియోజకవర్గంలో అభివృద్థిపై దృష్టి సారించలేదనేది బాలక్రిష్ణ భావన. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నదే బాలక్రిష్ణ ఆలోచనట.
హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పౌరాణిక డైలాగులు చెప్పడంలో బాలక్రిష్ణకు ఆయనే సాటి అంటారు తెలుగు ప్రేక్షకులు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆ తరువాత హిందూపురంలో పూర్థిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఆ తరువాత పట్టించుకోవడం లేదు. ఏదో ఒక రంగంపై దృష్టి పెట్టాలనేది బాలక్రిష్ణ ఆలోచనట. అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం కూడా తీసేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఐతే ఆయనకు వ్యతిరేక వర్గం మాత్రం మరో రకంగా ప్రచారం చేస్తోంది. హిందూపురంలో తాగునీటి సమస్యను బాలయ్య పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారనీ, ఆ నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఈసారి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. అందువల్లే బాలయ్య ఇలాంటి ఆలోచనకు వచ్చి వుంటారని చెపుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి వుంది.