Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. మరోవైపు ఎండలే ఎండలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (11:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగటిపూట ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ ఉప కేంద్రం తెలిపింది. ఈ వర్షాలకుతోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపారు. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా 60 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. మరోవైపు, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన తీరం దాటుతుందని తెలిపింది.

మోకా తుఫాను ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మనార్‌ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటి అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన మోకా.. గత రాత్రి తీవ్ర తుఫానుగా మారింది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments