Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను తల్లిని చేసిన కామాంధుడు.. ఏడేళ్ళ జైలుశిక్ష విధించిన కోర్టు

కడప జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం చేసి తల్లిని చేసిన కేసులో ఓ కామాంధుడికి స్థానిక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (10:06 IST)
కడప జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం చేసి తల్లిని చేసిన కేసులో ఓ కామాంధుడికి స్థానిక కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట కొత్తవడ్డెపల్లెకు చెందిన బాలిక.. చక్రాయపేట మండలం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి చదువుతూ వచ్చింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లగా, ఆరోజు చీకటిపడ్డాక ఊరి పొలిమేరలో ఉన్న చిన్నబావి వద్ద స్నానం చేయడానికి వెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసివున్న వీరాంజనేయులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె భయపడి ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పకుండా మళ్లీ పాఠశాలకు వెళ్లింది. కొన్ని నెలలకు స్కూలు సిబ్బంది ఆమె గర్భందాల్చిన విషయం గుర్తించారు. 
 
2010 జనవరి 11న ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. బాధితురాలి తండ్రి ఆ ఏడాది ఫిబ్రవరి 8న లక్కిరెడ్డిపల్లె పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా.. బాధితురాలి గర్భంలో పెరుగుతున్న శిశువుకు వీరాంజనేయులే తండ్రి అని వైద్యులు నిర్ధారించారు. అయితే అతడు మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసినందుకు రాయచోటిలోని జిల్లా సెషన్స్‌ కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments