Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రజా ప్రతినిధి భర్త కూడా..

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ దారుణం జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ బాలికపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కామాంధుల్లో ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త కూడా ఉండటం గమనార్హం. తాజాగా

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (14:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ దారుణం జరిగింది. క్షుద్రపూజల పేరుతో ఓ బాలికపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కామాంధుల్లో ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త కూడా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన కళమ్మ రెడ్డి అనే మహిళ క్షుద్రపూజల్లో పాల్గొనాల్సిందిగా ఒప్పించింది. ఈ యేడాది జనవరి 29వ, తేదీ నుంచి ఇంటి నుండి బాలికను కళమ్మ రెడ్డి తీసుకెళ్ళింది. మోత్కూరు మండలంలోని అనాజిపురంలో నిజామాబాద్‌కు చెందిన మట్టి వినోద్ కుమార్, రాజు, వినోద్‌లకు బాలికను అప్పగించింది. 
 
అయితే వాళ్ళు ఈ బాలికను అద్దె గదిలోకి తీసుకెళ్ళి పూజలు చేయాలంటూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో మద్యం తాగించి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత పూజలు పూర్తయ్యాయని బాలికను ఇంటికి పంపారు. 
 
అయితే ఈ నెల 13వ, తేదీన కళమ్మ రెడ్డి మళ్ళీ బాలికను మభ్యపెట్టింది. ఇప్పుడు వెళ్తే డబ్బులు వస్తాయంటూ తీసుకెళ్ళింది. నెమ్మాని గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉంచింది. నెమ్మాని ఎంపిటీసి సభ్యురాలి భర్త ఉయ్యా వెంకన్నతో పాటు మరికొందరు వ్యక్తులు బాలికపై ఈ నెల 15వ, తేదీ వరకు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, తండ్రికి అనుమానం వచ్చి బాలికను నిలదీశాడు. దీంతో ఆ బాలిక అసలు విషయాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించింది. దీంతో తండ్రి సైదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం