ఏపీ మంత్రి విశ్వరూప్‌కు బ్రెయిన్ స్ట్రోక్ - హైదరాబాద్‌కు తరలింపు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పి.విశ్వరూప్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం అత్యవసరంగా హైదరాబాద్ నగరానికి తరలించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
సెప్టెంబరు 2వ తేదీ వైఎస్ఆర్ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన వైఎస్ఆర్ వర్థంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ విశ్వరూప్‌కు వైద్యం అందించిన వైద్యులు.. ఆయనకు స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ వెళ్లాలని ఆయనకు వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం రాత్రి రాజమండ్రి నుంచి విశ్వరూప్‌ను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments