Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ మీడియాలో సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నెట్టింట్లో నారా లోకేష్‌కు ఆంధ్రా పప్పు అనే బ్రాండ్ కూడా ఉం

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (16:42 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ మీడియాలో సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నెట్టింట్లో నారా లోకేష్‌కు ఆంధ్రా పప్పు అనే బ్రాండ్ కూడా ఉంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పందించారు. గూగుల్ సెర్చ్‌లో ఏపీ పప్పు అని కొడితే లోకేష్ పేరు వస్తుందనే విషయం కూడా సరైన సమాధానం ఇచ్చారు. 
 
ఇలాంటి ప్రచారాల గురించి పట్టించుకోను. చేస్తే చేసుకోనివ్వండి. ఇంతకంటే ఇంకేమీ చేయలేరు. రెండు ఆర్టికల్స్, ప్రోగ్రాములు చేస్తారంతే. కానీ తానేం చేస్తున్నానో ప్రజలకు బాగా తెలుసునని.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోనని నారా లోకేష్ స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక కార్యకర్తల కోసం ఎన్నో చేశానని.. 2014-16లో ఎవరూ ఊహించని విధంగా 50 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో చేర్పించాను. 
 
2016-18లో 70 లక్షల మంది కార్యకర్తలను చేర్పించాను. ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నాను. ఇంకా ప్రజల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 40లక్షల వీధి దీపాలు వంటి ఎన్నెన్నో చేశాను. పప్పుగాడైతే ఇవన్నీ చేస్తాడా? అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటివరకు గత 100 రోజుల్లో ఆన్ లైన్ ద్వారా 5000 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 3,092 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments