Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి లోకేష్ చక్కగా మాట్లాడుతున్నారు... ప్రభుత్వ విప్ యామినీ బాల

అమరావతి: శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు హాజరు కాకపోయినా నియోజకవర్గం వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు చర్చించి సమాధానాలు రాబడుతున్నామని ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆమ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (21:02 IST)
అమరావతి: శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు హాజరు కాకపోయినా నియోజకవర్గం వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు చర్చించి సమాధానాలు రాబడుతున్నామని ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆమె మాట్లాడారు. శాసనసభ సమావేశాలు సజావుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సభాపతి అందరికీ అవకాశం ఇస్తున్నారన్నారు.
 
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి హామీ పొందుతున్నామన్నారు. మంత్రి లోకేష్ బాబు సభలో చక్కగా మాట్లాడినట్లు చెప్పారు. గత 30 రోజులుగా తాము ప్రతి గ్రామం సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పేదలను అన్ని అంశాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందన్నారు. 
 
రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ద్వారా బహుళ జాతి సంస్థల పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి మహానగరం మహా అద్భుతంగా నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా చురుకుగా సాగుతున్నట్లు యామిని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments