Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక దివ్యాంగురాలి నోట్లో గుడ్డలు గుక్కి - చిత్రవధ చేసి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు తాడేపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. కొన్ని మానవమృగాలు ఓ మానసిక దివ్యాంగురాలిని చెరబట్టాయి. నోట్లో గుడ్డలు కుక్కి, చిత్రవథకు గురిచేశాయి. ఆ తర్వాత గదిలో నాలుగు గంటలపాటు బంధించి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఇటీవల గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణహత్య ఘటనలను మరువకముందే రాజుపాలెం మండలంలో 17ఏళ్ల దళిత విద్యార్థినిపై మానవమృగాలు అఘాయిత్యానికి ఒడిగట్టాయి. మానసిక దివ్యాంగురాలి నోట్లో గుడ్డలు గుక్కి 4గంటలు చిత్రవధ చేశారు. ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేసి బాధితురాలిని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరులోని నల్లకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలను రాజుపాలెంలోని ఆర్‌ఆర్‌పాలెం(పులిచింతల పునరావస కేంద్రం)సెంటర్‌లో ఉంటున్న నాయనమ్మ వద్ద ఉంచారు. మానసిక దివ్యాంగురాలైన పెద్దకుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉంటూ పదో తరగతి పూర్తి చేసింది. 
 
ఇటీవల నాయనమ్మ మరణించగా, అంత్యక్రియలకు కుటుంబసభ్యులు రాజుపాలెం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలు బుధవారం ఉదయం సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన లాబు(27), సంజయ్‌(35) ఆమె నోట్లో గుడ్డలు గుక్కి ఇంట్లోకి లాక్కెళ్లారు. మద్యం తాగిన వారిద్దరూ నాలుగు గంటలపాటు ఆమె దుస్తులు చింపి, ఒంటిపై రక్కి చిత్రవధకు గురి చేశారు. 
 
ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమార్తె పరిస్థితి చూసి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం కేసు నమోదు చేసిన రాజుపాలెం పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆమె మానసిక, శారీరక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments