Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివింది.. పదో తరగతి.. 50 రోజుల్లో రూ.6.3లక్షలు స్వాహా.. ముగ్గురికి కుచ్చుటోపీ.. ఎలా?

కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని ముగ్గుర్ని మోసం చేసింది. విద్యావంతులు, ఉద్యోగులు పదో తరగతి చదివిన అమ్మాయి చేతిలో మోసపోయారు. కోట్లాది ఆస్తులున్నాయని నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. భారీగా డబ్బు

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (13:28 IST)
కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని ముగ్గుర్ని మోసం చేసింది. విద్యావంతులు, ఉద్యోగులు పదో తరగతి చదివిన అమ్మాయి చేతిలో మోసపోయారు. కోట్లాది ఆస్తులున్నాయని నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. భారీగా డబ్బు గుంజేసుకుని.. తీరా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి చెందిన శ్రీలత పదో తరగతి చదువుకుంది. కానీ మోసాలు చేయడంలో ఆమెకు ఆమే సాటి. పెళ్లిపేరుతో 50 రోజుల్లో రూ.6.3 లక్షలు స్వాహా చేసింది. 
 
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సుస్మిత పేరుతో అందమైన మరో యువతి ఫొటోను మ్యాట్రీమోనీలో పెట్టింది. తనకు హైదరాబాద్, బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని ప్రొఫైల్‌లో పేర్కొంది. తండ్రి సింగపూర్‌లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడని.. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని పేర్కొంది. ఆమె ప్రొఫైల్ నచ్చిన ముగ్గురు వ్యక్తులు శ్రీలతను సంప్రదించారు. 
 
తల్లిదండ్రులు అంగీకరిస్తే ఈ మేలో పెళ్లి చేసుకుందామంటూ ముగ్గురికీ వేర్వేరుగా చెప్పింది. కానీ పెళ్లి చూపులు ఫిక్స్ చేసి ముందు రోజు ఏదో సాకు చెప్పి డబ్బులు తీసుకునేది. ఆపై ఫోన్ స్విచ్ఛాప్ చేసేది. ఇలా ముగ్గురిని మోసం చేసింది. ఇలా ఇలా శ్రీలత వలలో చిక్కుకుని ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న ఓ టెక్కీ మోసపోయాడు. అయితే ఈ ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీలత బండారం బయటపడింది. ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె మోసాలు విని అవాక్కయ్యారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments