Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్తిగా కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్... మెగా ఫ్యామిలీ ఫుల్ స్వింగ్!

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:06 IST)
మెగా ఫ్యామిలీ, యువ కెర‌టం సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విష‌యాన్ని మెగా స్టార్ చిరంజీవి తెలియ‌జేశారు. మా కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి  సాయి ధరమ్ తేజ్  పూర్తిగా కోలుకున్నాడ‌ని పేర్కొన్నారు. 
 
 
గ‌త సెప్టెంబ‌రులో రోడ్డు ప్ర‌మాదంలో స్పోర్ట్ బైక్ పై నుంచి కింద ప‌డి సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అపోలో ఆసుప‌త్రిలో చికిత్స అనంత‌రం ఇంటికి చేరిన తేజ్, ఇపుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా క‌నిపిస్తున్నారు. మెగాస్టార్ చేసిన ట్వీట్ కి తేజ్ రిప్ల‌యి కూడా పెట్టాడు. ఇంత‌టి ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు చిరంజీవికి ధ‌న్య‌వాదాలు కూడా తెలిపాడు తేజ్.
 
 
ఈ దీపావ‌ళికి మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి, చేసిన సంద‌డిని చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తో పాటు చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, ప‌వ‌న్ క‌ల్యాణ్, వ‌రుణ్ తేజ్, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, వైష్ణ‌వ్ తేజ్ కూడా ఉన్నారు. బ‌య‌ట ఎన్ని వ‌దంతులు వ్యాప్తి చేసినా, తాము మాత్రం మెగా ఫ్యామిలీ అంతా ఒక‌టేన‌ని వీరంతా నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో చేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా అటెండ్ అవుతూ, త‌మ ఐక్య‌త‌ను చాటుతున్నారు. మ‌రో ప‌క్క అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌ను అన్నీ తానై న‌డిపిస్తూ, సంద‌డి చేయ‌డం చూస్తే, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఔరా, మెగా ఫ్యామిలీ అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments