Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చోబెడతారా? ఆయన ఏమన్నారంటే?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (18:00 IST)
దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నట్లు స్వయంగా ప్రకటించడంతో.. తదుపరి తెలంగాణ సీఎం మీరేనా అనే ప్రశ్నకు.. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ తరపున రాష్ట్రమంతా పర్యటించానని చెప్పారు. 
 
రాష్ట్రం సాధించుకున్నాక సిరిసిల్ల నుంచి ప్రజామోదంతో గెలుపొందానని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ తనకు మంత్రిగా తన కేబినెట్‌లో ఓ అవకాశం ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేసి అప్పట్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ఘనవిజయం సాధించామన్నారు. 
 
ప్రస్తుతం తనకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించారు. ఇదే తరహాలో భవిష్యత్ ఇచ్చే ఏ బాధ్యతను అయినా స్వీకరించేందుకు సిద్ధంగా వున్నానని చెప్పారు. రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ లాంటిదేనని కేటీఆర్ తెలిపారు. 
 
ఓసారి రంగంలోకి దిగాక మనల్ని మనం నిరూపించుకోవాల్సి వుంటుందని కేటీఆర్ తెలిపారు. ప్రజల మద్దతును సంపాదించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాననీ, నాలుగు ఎన్నికలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments