Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో ఉన్న విభేదాల వల్లే సంధ్యారాణి సూసైడ్ చేసుకుంది.. ప్రొఫెసర్ లక్ష్మి వాదన

గుంటూరు వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. బెంగుళూరులో తన బంధువుల ఇంట తలదాచుకుంటూ వచ్చిన ఆమె.

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (12:28 IST)
గుంటూరు వైద్య కాలేజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడింది. బెంగుళూరులో తన బంధువుల ఇంట తలదాచుకుంటూ వచ్చిన ఆమె.. అక్కడ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేయడంతో ఆమె ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆ సమయంలో ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులతో ఆమె తీవ్ర స్థాయిలో వాదనకు దిగింది. ఒక దశలో సంధ్యారాణి, ఆమె భర్తకు వైవాహిక సమస్యలు ఉన్నాయనీ, అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ వాదించింది. అయితే, పోలీసులు మాత్రం ఆమె వాదనను పట్టించుకోకుండా అరెస్టు చేసి గుంటూరుకు తీసుకొచ్చారు. 
 
మరోవైపు.. సంధ్యారాణి ఆత్మహత్య తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లక్ష్మి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి పక్కనపడేశారు. ఏటీఎం కార్డును సైతం ఎక్కడా ఉపయోగించలేదు. దీంతో ఆమెను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఒంగోలు, చెన్నై, పాండిచ్చేరి, షోలాపూర్, హైదరాబాద్‌లతో పాటు.. మొత్తం 16 ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇక లాభం లేదనుకుని లక్ష్మి భర్త, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి లక్ష్మికి సహకరించిన గుంటూరు వాసి తేళ్ల హరిబాబు ఫోన్ నుంచి వెళ్లిన ఓ కాల్‌పై నిఘా పెట్టిన పోలీసులకు ఆమె ఆచూకీపై స్పష్టత వచ్చేసింది. బెంగళూరు నుంచి హరిబాబు బంధువులు, స్నేహితులకు ఓ నంబరు నుంచి ఫోన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా సోమవారం ఉదయం పోలీసులు బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక డీజీపీ ఓంప్రకాశ్‌కు ఏపీ డీజీపీ సాంబశివరావు సమాచారం ఇచ్చారు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్న ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త, ఆశ్రయం ఇచ్చిన బంధువు కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments