Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే మాజీ ఈవో... మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత

మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (10:02 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, ప్రముఖ రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. ఆయన వయసు 77 యేళ్లు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా సోమవారమే పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. 
 
మాజీ ప్రధానమంత్రి నరసింహారావుకు మీడియా సలహాదారునిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ 'అసలేం జరిగిందంటే' పేరిట యధార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాయగా, అది సంచలనం సృష్టించింది. ఇంకా 'కర్త అతడే', 'తిరుమల చరితామృతం', 'తిరుమల లీలామృతం'.. వంటి పుస్తకాలు కూడా రాశారు. 
 
పీవీఆర్‌కే ప్రసాద్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. పీవీఆర్‌కే ప్రసాద్‌ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు సలహాదారుగా సుదీర్ఘకాలం పనిచేశారు. అలాగే తిరుమల ప్రాశస్త్యంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పీవీఆర్‌కే‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments