Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది 'బయోమ్యాక్స్' కాదు.. 'భయోమ్యాక్స్'.. మూసివేతకు పీసీబీ ఆదేశం

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:10 IST)
విశాఖ జిల్లాలోని దువ్వాడ సెజ్‌లో భారీ ప్రమాదానికి కారణమైన బయోడీజిల్‌ కంపెనీ "బయోమ్యాక్స్‌ ఫ్యూయల్స్‌ లిమిటెడ్"ను తక్షణమే మూసివేయాలని ఆంధ్రప్రదేశ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కంపెనీకి ఉత్తర్వులు ఇచ్చామని పీసీబీ జాయింట్‌ చీఫ్‌ పర్యావరణ ఇంజనీర్ మధుసూదనరావు వెల్లడించారు. 
 
ఈ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ కంపెనీ బయోమ్యాక్స్‌గా లేదనీ, భయోమ్యాక్స్‌గా మారిపోయిందన్నారు. కంపెనీలో వ్యర్థపదార్థాలను ట్యాంకర్ల ద్వారా బయటకు తరలించాల్సి ఉందన్నారు. మరోవైపు బయోమ్యాక్స్‌లో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాదం జరిగినప్పటికీ గురువారం రాత్రికి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ట్యాంకుల కింది నుంచి మంటలువస్తూనే ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
ట్యాంకుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను సాంకేతికంగా అదుపుచేయాలని భావించిన తూర్పునౌకాదళం... 'డ్రై కెమికల్‌ పౌడర్'తో తయారుచేసిన 'ఫైర్‌బాల్స్‌'ను డార్నియర్‌ విమానం ద్వారా గురువారం ఉదయం ప్రమాద ప్రాంతంలో జారవిడిచినప్పటికీ.. ఆ ప్రాంతమంతా చిత్తడి, బురదమయంగా మారడంతో డ్రై కెమికల్‌ పౌడర్‌ ప్రభావం చూపించలేక పోయింది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments