స్వయం సహాయక సంఘాలకు మాస్కుల తయారీ పని

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:08 IST)
మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. తొలుత ‘కరోనా’ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి మాస్కుల పంపిణీ ప్రారంభిస్తామని, రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు.

క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు.

ఆర్టీకే కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని, సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments