Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు ఆవిర్భావవారోత్సవాలు... గాలింపునకు వెళ్తున్న బలగాలు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:58 IST)
మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుండటంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవుల్లో గాలింపు చేపడుతున్నాయి. ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తారు.
 
ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్‌ కావడం తదితర సంఘటనలతోపాటు ఏవోబీలో రెండు సార్లు ఎదురుకాల్పులు జరగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.
 
మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గూడెంకొత్తవీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి.
 
ప్రభుత్వ ఆస్తుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments