Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు : డిజిపి రాముడు

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:22 IST)
ఏపీలో మావోయిస్టుల కదలికలు లేవని రాష్ట్ర డీజీపీ రాముడు అన్నారు. ఉత్తరాంధ్రలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయని చెప్పడంతో ఎంత మాత్రం నిజం లేదన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సైబర్‌ క్రైం సదస్సులో ఆయన పాల్గొన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోనే పోలీసు విభాగానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణాలను చేపడతామన్నారు. తిరుమలకు ఎలాంటి ముప్పు లేదని, ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. 
 
తిరుపతి అలిపిరిలోని తనిఖీ కేంద్రం అధునాతన స్కానింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని టిటిడిని ఆదేశించినట్లు చెప్పారు. వాహనం వెళుతుండగానే ఒక్కసారిగా స్కానింగ్‌ అవుతుందని, దీని వల్ల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. 
 
ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తక్కువ మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని, అయితే పట్టుబడిన వారందరికీ కఠిన శిక్షలు పడాలన్న ఉద్దేశంతో కేంద్రానికి ఒక లేఖ రాశామని, అదే విషయంపై త్వరలో తెలుగుదేశంప్రభుత్వంపై అసెంబ్లీలో నిర్ణయం కూడా తీసుకోనుందన్నారు. ఎర్రచందనం విషయంలో టాస్క్ ఫోర్స్ తో పాటు పోలీసులు, అటవీశాఖ కలిసి కట్టుగానే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments