Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ప‌లువురు విరాళం

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:34 IST)
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్నదాన ప‌థ‌కానికి ప‌లువురు దాత‌లు శ‌నివారం విరాళాలు అందించారు. విజ‌య‌వాడ స‌మీపంలోని పెన‌మ‌లూరుకు చెందిన కిలారు వెంకయ్య చౌదరి రూ.1,01,116లు విరాళం ప్ర‌క‌టించారు.

కిలారు సబర్మతీ భాయి, బలరామారావు పేరున‌ అన్నదానం జ‌ర‌పాల‌ని పేర్కొంటూ విరాళం చెక్కును ఆలయ అధికారులకు అందించారు. అదేవిధంగా మ‌రొక దాత విజ‌య‌వాడ టిక్కిల్‌రోడ్డులో నివాసం ఉంటున్న మేకా విధ్యాధరి, డాక్ట‌ర్ ఎం.వై.నాయుడు నిత్యాన్న‌దానం నిమిత్తం రూ.1,01,116లు దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి చెక్కును ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబును కలిసి అంద‌జేశారు.

అలాగే విజ‌య‌వాడ‌లోని విద్యాధ‌ర‌పురం కామ‌కోటిన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఇంకొక దాత ‌చిట్టి రామకృష్ణ రూ.1,01,116లు విరాళాన్ని ఆయ‌న ధర్మపత్ని వెంకటదుర్గా శేషుకుమారి పేరున నిత్యాన్న‌దానం నిమిత్తం దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి చెక్కు అందజేశారు.

అనంత‌రం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం క‌ల్పించి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments