Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌క్క‌నే ఉన్నార‌ని ప‌వ‌న్ తో స్టేజీపై మాట్లాడ లేదు...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (12:39 IST)
తాము ఎంతో నిజాయితీగా మా ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ ప్రకాష్ రాజ్ సి.సి.ఫుటేజ్ తీసుకున్నా ఉపయోగం లేద‌ని, తాము నిజాయితీగానే గెలిచాం అని విష్ణు వివ‌రించారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయక ముందే నాదే గెలుపని ప్రకాష్ రాజ్ నాతో కరచాలనం చేశార‌ని, ఆయ‌న ఏం చేశారో సిసి ఫుటేజ్ లో నిక్షిప్తం అయి ఉంద‌ని విష్ణు చెప్పారు. పృథ్వీ ఆరు ఓట్లతో ఓడిపోవడంతో తాను బాధపడ్డాను అని అన్నారు. చిరంజీవి త‌మ‌కు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, మా నాన్న మోహ‌న్ బాబుతో చిరంజీవి మాట్లాడార‌న్నారు. అలాగే అలై బ‌లైలో పవన్ కళ్యాణ్ తో స్టేజ్ కింద మాట్లాడాన‌ని, ఉప రాష్ట్రపతి ఉండడం వల్ల స్టేజ్ పై మాట్లాడుకోలేద‌ని మంచు విష్ణు వివ‌ర‌ణ ఇచ్చారు. 
 
పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తించాలని ఈయనెవరో తెలుసా అంటూ ట్వీట్ చేశాన‌ని, అలాగే, 
వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయొచ్చు అని తెలిపారు. మా అసోసియేషన్ లో జర్నలిస్టు కొండేటి సురేష్ ఉన్నార‌ని, జర్నలిస్టు నటుడు ఎలా అవుతాడ‌ని విష్ణు ప్ర‌శ్నించారు. నటులే మా అసోసియేషన్ సభ్యులుగా ఉండాలని బైలాస్ ను తీసుకొస్తామ‌ని మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments