Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.. కానుగ చెట్టుకు ఉరేసుకుని..

సంతానం కలగలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెప్పిపొడుపు మాటలు తట్టుకోలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా, గుడిబండ మండలంలోని హెచగొల్లహట్టి గ్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:56 IST)
సంతానం కలగలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దెప్పిపొడుపు మాటలు తట్టుకోలేక ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా, గుడిబండ మండలంలోని హెచగొల్లహట్టి గ్రామానికి చెందిన చిక్కన్న(28) సంతానం లేదనే మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. చిక్కన్నకు ఐదేళ్లకు అదే గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. 
 
దాంపత్య జీవనం అన్యోన్యంగా సాగినా.. సంతానం కలగకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన చిక్కన్న.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదు. 
 
ఆదివారం గొర్రెలు కాపర్లు గ్రామ సమీపంలోని కానుగ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కవిత, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. నల్గొండ జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో శనివారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికిన ఓ భర్త, తన మూడేళ్ల కూతురుని తీవ్రంగా గాయపరిచి, ఆపై తన ఎనిమిది నెలల చిన్నారిని ఎత్తుకుని విద్యుత్తు షాకు పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Local Boy Nani: బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్.. నాని అరెస్ట్

Lakshmi Manchu: అందాల రహస్యాలపై శ్రీదేవి గురించి లక్ష్మి మంచు చెప్పిన సీక్రెట్

అనగనగా ఉపాధ్యాయుడిగా సుమంత్‌

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లోనా? చేసే చేతల్లో నా? చెప్పేదే సారంగపాణి జాతకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments