Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు టీబీ: తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ప్రేమించి..

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (11:39 IST)
రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యకు టిబి ఉందని తెలిసి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ జి.సురేష్ (24) రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
 
పెళ్లి సమయంలో జ్యోతి తనకున్న టిబి వ్యాధి గురించి దాచిపెట్టింది. రెండు నెలలు బాగానే కాపురం చేసిన ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
 
అక్కడ ఆమెకు అప్పటికే టిబి ఉన్న విషయం బయటపడటంతో ఆమెను ఎర్రగడ్డలోని టిబీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లిన సురేష్ అక్కడ చేర్పించి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మానసికంగా కుంగిన అతను జీవితంపై విరక్తితో ఇంట్లో దులానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments