Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుకుంటా.. విలువైన పార్శిల్ పంపుతున్నా అనగానే? రూ.20లక్షలు ఖాతాలో వేసింది?

తొలి భర్త చిత్రహింసలకు గురిచేశాడు. తొలి భర్త వేధింపులు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో వేరేదారి లేక మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లో వరుడి కోసం

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (10:45 IST)
తొలి భర్త చిత్రహింసలకు గురిచేశాడు. తొలి భర్త వేధింపులు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో వేరేదారి లేక  మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లో వరుడి కోసం అన్వేషించింది. రెండో పెళ్లి చేసుకున్నా.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని.. బ్రిటన్‌లో వ్యాపారవేత్తనని బురిడీ కొట్టించాడు. రాచకొండ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. నాచారానికి చెందిన మహిళ ఓ ప్రముఖ పాఠశాలలో టీచర్‌. ఏడాది క్రితం ఆమెకు వివాహమైంది. భర్త మందుకు బానిసై చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో అతని నుంచి ఆమె విడాకులు తీసుకుంది. రెండో పెళ్లి కోసం మాట్రిమొనీలో తల్లిదండ్రుల ఆలోచన పేరిట అన్వేషించిన టీచర్‌కు మళ్లీ మోసమే జరిగింది. బ్రిటన్‌లో వ్యాపారమని పెళ్లి చేసుకుంటానని మ్యాట్రీమొనీ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో ఆ టీచర్ సంతోషపడింది. 
 
నిత్యం ఫేస్‌ బుక్‌లో ఛాటింగ్‌లు.. వాట్సప్‌లో సందేశాలు.. వెల్లువెత్తాయి. ఒక రోజు ‘మన ప్రేమకు గుర్తుగా నీకు విలువైన పార్శిల్‌ పంపిస్తున్నా. ఇందుకు కొంత ఛార్జీలు చెల్లించమన్నాడు. బ్యాంకు ఖాతాలు పంపాడు. నిజమని నమ్మిన ఆమె పలు దఫాలుగా రూ.20 లక్షల్ని ఆ వ్యక్తి ఖాతాలో జమచేసింది. ఆ తర్వాత అతడు ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశాడు. రోజులు గడుస్తున్నా పార్శిల్‌ ఇంటికి చేరలేదు. మోసపోయానని లేటుగా గ్రహించిన ఆమె రాచకొండ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments