Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ చిన్నారిపై మానవమృగం అత్యాచారం.. రేపిస్ట్ వయసు 52 యేళ్లు!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (09:12 IST)
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ళ చిన్నారిపై ఓ మానవమృగం అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే అనంతపురం జిల్లా రోళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి అదే గ్రామంలో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని అదే గ్రామానికి చెందిన గంగప్ప అనే వ్యక్తి.. మజ్జిగ పోస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పిన అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. 
 
ఈ పరిస్థితుల్లో మంగళవారం చిన్నారికి తల్లి స్నానం చేయిస్తుండగా, చిన్నారి ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉండటాన్ని గమనించి గద్దించి అడగడంతో ఆ చిన్నారి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ వెంటనే చిన్నారిని స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గంగప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఆరేళ్ళ చిన్నారిపై తన భర్త అత్యాచారం చేశాడన్న వార్త తెలుసుకున్న గంగప్ప భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే మడకశిర ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారిపై అత్యాచారినికి పాల్పడిన కామాంధుడి వయసు 52 యేళ్లు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments