Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరి వాసులకు హెచ్చరిక - 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (17:12 IST)
హైదరాబాద్ నగర వాసులకు భాగ్యనగరి ట్రాఫిక్ పోలీసులు ఓ హెచ్చరిక చేశారు. హైదరాబాద్ నగరంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పోలీసులు ఎంపిక చేసిన మార్గాల్లో వాహనాలను క్రమబద్దీకరించనున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు వీలుగా కొత్త ఫ్లైఓవర్, రహదాలులను జీహెచ్ఎంసీ నిర్మంచనుంది. ఇందులోభాగంగా, శిల్ప లే అవుటే ఫేజ్-2 వద్ద నూతన ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు. 
 
ఈ నల 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇందులోభాగంగా గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌ వరకు వాహనాలను దారిమళ్లించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్‌ టు కొండాపూర్‌ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
 
గచ్చిబౌలి ఔటర్‌ నుంచి కొండాపూర్‌ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి శిల్పా లేఅవుట్‌ ఫ్లైవోవర్‌ వద్ద దారి మళ్లించి, మీనాక్షి టవర్స్‌, డిలైట్‌, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్‌ రహదారి మీదుగా కొత్తగూడ ఫ్లైవోవర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట్‌ మీదుగా అనుమతిస్తారు.
 
లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద దారి మళ్లించి, డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌, రాడిసన్‌ హోటల్‌ మీదుగా కొండాపూర్‌ వైపు అనుమతిస్తారు.
 
ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లే వాహనదారులు, ట్రిపుల్‌ జంక్షన్‌ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద యూ టర్న్‌ తీసుకొని గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నుంచి డీఎల్‌ఎఫ్‌ ఐటీ పార్క్‌, రాడిసన్‌ హోటల్‌, కొండాపూర్‌ మీదుగా ఆల్విన్‌కాలనీ వైపు వెళ్లాలి.
 
టోలిచౌకి ప్రాంతం నుంచి ఆల్విన్‌ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని మైండ్‌స్పేస్‌, సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌ మీదుగా హైటెక్స్‌ జంక్షన్‌ కొత్తగూడ, కొండాపూర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
 
గచ్చిబౌలి టెలికాంనగర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి జంక్షన్‌ ఫ్లైవోవర్‌ కింద యూ టర్న్‌ తీసుకొని శిల్పా లేఅవుట్‌ ైఫ్లైవోవర్‌, మీనాక్షి టవర్స్‌, డిలైట్‌, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్‌ మీదుగా కొత్తగూడ, కొండాపూర్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
 
ఆల్విన్‌ కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొత్తగూడ జంక్షన్‌ నుంచి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని హైటెక్స్‌ రోడ్‌, సైబర్‌టవర్స్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, శిల్పా లేఅవుట్‌ ఫ్లైవోవర్‌ మీదుగా గచ్చిబౌలి వెళ్లాల్సి ఉంటుంది.
 
ఆల్విన్‌కాలనీ జంక్షన్‌ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని శ్రీరాంనగర్‌ కాలనీ, మజీద్‌బండా, హెచ్‌సీయూ డిపో మీదుగా లింగంపల్లి వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments