Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరుకు కత్తి... గృహంలోనే పరిపూర్ణానంద స్వామి

శ్రీరాముడుని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యానించి కోట్లాది మంది హిందువుల మనోభాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆరు నెలల నిషేధం విధించారు. ఒక వేళ తమ నిషేధాజ్ఞలు ఉల్ల

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (13:03 IST)
శ్రీరాముడుని ఉద్దేశించి కించపరిచేలా వ్యాఖ్యానించి కోట్లాది మంది హిందువుల మనోభాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆరు నెలల నిషేధం విధించారు. ఒక వేళ తమ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి హైదరాబాద్‌లో అడుగుపెడితే మాత్రం మూడేళ్ళ జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. అదేసమయంలో కత్తి మహేష్‌ను ఆయన సొంతూరు అయిన చిత్తూరుకు తరలించారు.
 
ఇకపోతే, కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భంధంలో ఉంచారు. రెండో రోజు అయిన మంగళవారం కూడా ఆయన్ను ఇంటికే పరిమితం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే నిరాహారదీక్షకు దిగడంతో ఆయనతో పాటు.. మరో 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. .
 
మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్‌పీ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments