Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్రిపాలెం గ్రామంలో డ్రెయిన్లు, రోడ్లు బాగుపడుతున్నాయ్ : హీరో మహేశ్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... తాను నటించిన శ్రీమంతుడు చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని తన సొంత గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఈ గ్రామం ఉంది

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (15:33 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... తాను నటించిన శ్రీమంతుడు చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని తన సొంత గ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఈ గ్రామం ఉంది. 
 
రాజకీయ నేతల్లా కాకుండా, ద‌త్త‌త తీసుకొని పైపై ప‌నులు చేసి వ‌దిలేయ‌కుండా మ‌హేశ్ ఆ గ్రామాభివృద్ధిపై ఎంతో శ్ర‌ద్ధ‌పెడుతున్నారు. ఆయ‌న దృష్టి ప‌డిన త‌ర్వాత బుర్రిపాలెం అభివృద్ధిని సాధిస్తోంది. అక్కడ అనేక ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఆ గ్రామంలో డ్రెయిన్లు, రోడ్లు బాగుప‌డ్డాయి అంటూ తాజాగా ట్వీట్ చేశాడు. ఈ అభివృ్ద్ధి పనుల కోసం మహేష్ బాబు 2.14 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
మ‌హేశ్‌బాబు తాజాగా ఆ గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై త‌న‌ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అక్క‌డ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. గ్రామంలో జ‌రిగిన స‌ద‌రు ప‌నుల‌ ఫొటోలను ఆయ‌న‌ పోస్ట్‌ చేశారు. గల్లా జయదేవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments