Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరీ దుర్మార్గుడా.. నీకు నా భార్యే కావాల్సి వచ్చిందిరా.. హత్యకు దారితీసిన మేనత్తతో రాసలీలలు

మేనత్త వరుస అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడుని మేనమామ దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని డోర్నకల్ కురవిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పర

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (08:50 IST)
మేనత్త వరుస అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడుని మేనమామ దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని డోర్నకల్ కురవిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
పాలమూరు జిల్లాలోని కొత్తతండాకు చెందిన బానోత్‌ భద్రు, నాగమణి భార్యభర్తలు. భద్రు మేనల్లుడు మాలోత్‌ లింగన్న(25). వారితోనే కలిసివుంటున్నాడు. లింగన్న వ్యవసాయం చేస్తూనే అప్పుడప్పుడు కారు డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో రెండేళ్లుగా నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో భద్రు, లింగన్న మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఒక రోజున వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా, భద్రు చూశాడు. అప్పటి నుంచి లింగన్నను హత్య చేయాలని భద్రు ఓ నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండాలోని గణేష్‌ విగ్రహాన్ని యువకులు డీజే సౌండ్‌కు నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిస్తున్నారు. వారిలో మేనల్లుడు లింగన్న కూడా ఉండటాన్ని భద్రు చూశాడు. వెనుక నుంచి వచ్చి గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో లింగన్న తల పగిలి కింద పడ్డాడు. వెంటనే భద్రు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో ఉన్న లింగన్న తలకు ఓ వ్యక్తి తన షర్ట్‌ గట్టిగా కట్టి మరో వ్యక్తి సాయంతో బైక్‌పై కూర్చోబెట్టుకుని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ స్టెచర్‌పై పడుకోబెడుతుండగా లింగన్న మృతిచెందాడు. భద్రు గొడ్డలతో సహా కురవి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments