Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న దక్షిణకోస్తాంధ్ర మీదగా అల్పపీడనం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (18:50 IST)
ఉత్తరాంధ్ర మీదుగా ఉప‌రితల ఆవర్తనం మరియు ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీదగా  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా  వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు,కడప,కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.  భారీ వర్షాలు దృష్ట్యా విపత్తుల శాఖ కమీషనర్ కె.కన్నబాబు గారు వర్షప్రభావ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.

తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు  వేటకు వెళ్ళరాదని సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు కుడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments