Webdunia - Bharat's app for daily news and videos

Install App

విహహేతర సంబంధం... ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి.. మరొకరు ఆస్పత్రిలో.. అనాథలైన పిల్లలు

వివాహేతర సంబంధం ఇద్దరు ప్రేమికులను ఆత్మహత్యకు పురికొల్పింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Webdunia
బుధవారం, 27 జులై 2016 (11:31 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రేమికులను ఆత్మహత్యకు పురికొల్పింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ మహిళ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మకరాంపురం గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
వివరాల్లోకి వెళ్తే.... మకరాంపురం గ్రామానికి చెందిన వజ్జ రమేష్(30), అదే గ్రామానికి చెందిన ఎలుసూరి స్రవంతి మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్న కంకర గోతులు వద్ద గల జీడితోటలో మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో రమేష్ ప్రాణాలు కోల్పోయూడు. అంతకు ముందు ప్రియురాలు స్రవంతి సోంపేట సీఐ సూరినాయుడు, కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ వద్ద వాంగ్మూలం ఇచ్చింది.
 
స్రవంతి మాటల్లో... తనకు ప్రియుడు రమేష్‌తో 16 ఏళ్ల కిందట నుంచి ప్రేమ సాగుతోందని, పదేళ్ల కిందట తనకిష్టం లేకపోయినా మేనమామతో వివాహం చేశారని చెప్పింది. తర్వాత ప్రియుడు రమేష్ సిలగాం గ్రామానికి చెందిన గాయిత్రిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపింది. తనకు కూడా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపింది. 
 
అయితే, ఇటీవల కాలంలో ప్రేమికులమైన తాము తరచూ కలుస్తూ ఉండేవాళ్లమని చెప్పింది. రెండు నెలల కిందట గ్రామానికి చెందిన దేవాలయంలో రమేష్‌తో రహస్యంగా మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది.
 
మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో అందరూ నానా మాటలు అనడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డామని చెప్పింది. ఇదిలావుండగా రమేష్ మృతి చెందడంతో భార్య గాయిత్రి, మూడేళ్ల కుమారుడు అనాథలుగా మిగిలారు. 
 
మరోవైపు చావుబతుకుల్లో ఉన్న స్రవంతిని చూసి భర్త, ముగ్గురు పిల్లలు ఆందోళన చెందుతున్నారు. కాగా మృతుని సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ ఆర్.వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ మృతదేహానికి సోంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments