Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియా.. నన్ను వదిలిపోతున్నావా.. నీవు లేక నేను లేను.. ప్రియుడి ఆత్మహత్య

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి... తల్లిదండ్రుల ఒత్తిడితో మరో వివాహానికి సిద్ధపడటంతో ఆ ప్రియుడు భరించలేక పోయాడు. ప్రియురాలి శాశ్వత ఎడబాటును జీర్ణించుకోలేని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (08:34 IST)
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి... తల్లిదండ్రుల ఒత్తిడితో మరో వివాహానికి సిద్ధపడటంతో ఆ ప్రియుడు భరించలేక పోయాడు. ప్రియురాలి శాశ్వత ఎడబాటును జీర్ణించుకోలేని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే జమ్మలమడుగు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన జి.ఆదినారాయణ, దువ్వూరు మండలం మన్నెరాంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకొని వచ్చారు.
 
దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు దువ్వూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులిద్దరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే వీరిద్దరూ మైనర్‌లు అని ఈ వివాహం చెల్లదని పోలీసులు తేల్చి చెప్పారు. 3 సంవత్సరాల వరకు ఎవరూ వివాహం చేయకూడదని పోలీసులు ఇరువర్గాల పెద్దల అంగీకారంతో అగ్రిమెంట్‌ రాశారు. 
 
3 సంవత్సరాల తర్వాత ఆ యువతిని తాను ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుంటానని చెబితే అప్పుడు వివాహం జరిపించాలి. లేదంటే ఎవరంతట వారు ఉండాలని పోలీసులు సూచించారు. అయితే అగ్రిమెంట్‌ను కాదని యువతి తల్లిదండ్రులు సోమవారం ఆమెకు వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణ బుధవారం రాత్రి ఇంట్లో  ఉరివేసుకొని మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు మైనర్‌కు వివాహం చేశారని, తమ కుమారుడి మరణానికి అమ్మాయి తల్లిదండ్రులే కారణమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments