Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ముసుగులో మోసం.. పదేళ్ల ప్రేమ.. ఆపై సహజీవనం.. నిన్ను పెళ్లి చేసుకోననని మెసేజ్..

ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ పేరిట వంచించడం.. కట్నం కోసం వేధించడం ఎక్కువైపోయింది. తాజాగా పదేళ్ల పాటు ప్రేమ.. ఆపై సహజీవనం చేసిన జంట విడిపోయింది

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:23 IST)
ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ పేరిట వంచించడం.. కట్నం కోసం వేధించడం ఎక్కువైపోయింది. తాజాగా పదేళ్ల పాటు ప్రేమ.. ఆపై సహజీవనం చేసిన జంట విడిపోయింది. ఇందుకు కారణం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి పదేళ్లు గుంటూరులో చదువుకుంది. 
 
ఆమెకు ఆ ప్రాంతానికి చెందిన పాపయ్య అలియాస్‌ డేవిడ్‌ పరిచయయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఇద్దరూ కలిసి నగరంలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా పెళ్లికి ముహూర్తం ఖరారు కాకున్నా.. వివాహం కోసం మూడు లక్షల నగదు, ఐదు తులాల బంగారం పెడతామని అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పారు. అయితే పది రోజుల నుంచి పాపయ్య కనిపించకుండా పోయాడు. 
 
ఇంతలో యువతి ఫోనుకు గురువారం ఓ మెసేజ్ వచ్చింది. నిన్ను పెళ్లి చేసుకోనని.. నన్ను మర్చిపో అంటూ పాపయ్య సందేశం ఇచ్చాడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న పాపయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments