Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్స్.. ప్రేమ వివాహం.. అత్తామామల వేధింపులతో అల్లుడు ఆత్మహత్య

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (11:41 IST)
ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ విషయం నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు వేధింపులకు గురిచేశారు.. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్సడ్డాడు. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మంచిర్యాలకు చెందిన చెన్నవేని వెంకటేశ్ (28).. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై ఆరేళ్లయినా భార్య తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మేనత్త వెంకటేశ్‌ని నిత్యం వేధించేవారు. ఈ విషయంపై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.
 
పోలీస్ స్టేషన్లో సైతం వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు సర్ధిచెప్పినా అత్తమామల తీరులో మార్పు లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. వెంకటేశ్‌పై అత్తమామలు చేయి చేసుకున్నారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన వెంకటేశ్ ఊరి చెరువు దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారకులైన అత్తమామలను కఠినంగా శిక్షించాలని వాయిస్ రికార్డు చేసి తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు.
 
కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటేశ్‌ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వెంకటేశ్ మరణించాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments