Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి అంగీకరించలేదనీ రైలు కిందపడిన డిగ్రీ - ఇంటర్ విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (12:19 IST)
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్‌ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్‌ చదువుతోంది. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.  ఈ విషయాన్ని తమ కుటుంబ పెద్దలకు చెప్పారు. కానీ, వారు వారిద్దరి పెళ్లికి సమ్మతించలేదు.
 
దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ ప్రేమజంట.. ఒకరినొకకరు వేరుపడి జీవించలేక చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈపరిస్థితుల్లో శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments